ప్రపంచ చిరుధాన్యాల కేంద్రంగా నిలదొక్కుకోవాలనుకుంటున్న భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది.
చిరు ధాన్యాల(మిల్లెట్స్)కు గడిచిన దశాబ్ద కాలంగా అత్యంత ప్రాధ్యానత రావటానికి ముఖ్య కారణం, శ్రీ ఖాదర్ వల్లి గారు. ఈయన కొర్రలు, అండుకొర్రలు, సామలు, అరికెలు, ఊదలు ఈ ఐదు సిరిధాన్యాలను వెలికితీసి వాటి ప్రాధాన్యతను తిరిగి మళ్ళీ ప్రపంచానికి తెలియజేస్తున్నారు. వీటి ద్వారా కీళ్ల నొప్పులు, బి పి, మధుమేహం మొదలుకొని కాన్సర్ వరకు పలు ఆరోగ్య సమస్యలు నివారింపబడుట ప్రత్యక్షంగా ప్రజలకు లైవ్ ఉదాహరణలతో వివరిస్తున్నారు.
మన తెలుగువారు అందరికీ మిల్లెట్స్ ఉపయోగాలు, వాటి వాడకం గురించి వివరించడానికి ప్రత్యేకంగా Millets.News పోర్టల్ ప్రారంభించబడింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (IIMR) డైరెక్టర్ శ్రీ తారా సత్యవతి గారు ఈ పోర్టల్ ను ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్గానిక్ మిల్లెట్స్ ను అందించే స్టోర్ ల వివరాలు కూడా ఈ పోర్టల్ లో అందుబాటులో ఉన్నాయి.
© 2023 - 2024 Millets News. All rights reserved.