ఈ రోజుల్లో చాలామంది బీపీ (BP), షుగర్ (diabetes) తో బాధపడుతున్నారు. బీపీ, షుగర్ కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకని ఖచ్చితంగా బీపీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవడం చాలా అవసరం. ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందంటే దానిపై ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి ఆ సమస్య నుండి బయట పడడానికి చూసుకోవాలి. లేదంటే ఆ సమస్య నుండి అనేక రకాల సమస్యలు వచ్చి, రకరకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా సరైన జీవన విధానాన్ని పాటించాలి పోషకాహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ రోజుల్లో చాలామంది మిల్లెట్స్ ని తీసుకుంటున్నారు.
కొర్రలు (foxtail Millets), అరికలు (Kodo millet ), ఊదలు (Banyard millet ), సామలు (Little millet ), రాగులు (Finger millet) ఇటువంటివి. ఆధునిక జీవనశైలి వలన ఈ పంటలు తగ్గిపోతున్నాయి. తినేవాళ్ళ సంఖ్య అయితే పెరిగిపోతోంది. ఈ మిల్లెట్స్ ని తీసుకోవడం వలన అనేక రకాల రోగాలని అడ్డుకోవచ్చు. ఉబకాయం, క్యాన్సర్ మొదలు మధుమేహం, బీపీ వంటి సమస్యల్ని అడ్డుకునే శక్తి చిరుధాన్యాలకి ఉంది. ఈ మిల్లెట్స్ తో మనం అన్నం, సంగటి ఇటువంటివి తయారు చేసుకుని తీసుకోవచ్చు. నాలుక రుచి కోసం చూడకుండా చిరుధాన్యాలతో వంటలు చేసుకుని అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు.
షుగర్, బీపీ తో బాధపడుతున్న వాళ్ళు అన్నం తినడం మానేసి, చిరుధాన్యాలను తింటే షుగర్ బీపీ రెండూ కంట్రోల్ అవుతాయి. ఈ చిరుధాన్యాలతో మనం పరమాన్నం, బర్ఫీ పాయసం, కేసరి వంటివి చేసుకోవచ్చు. అదే విధంగా కేకులు, బిస్కెట్లు కూడా చేసుకోవచ్చు. రైస్ తో బిర్యాని చేసినట్లు మనం వీటితో కూడా తయారు చేసుకోవచ్చు చాలామంది కొర్రలతో వెజ్ బిర్యానీ తయారు చేసుకుంటారు. దీని రుచి చాలా బాగుంటుంది. రాగులతో దోసె లడ్డులు వంటివి తయారు చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన ఆహార పదార్థాలని చిరుధాన్యాలతో తయారు చేసుకుని బీపీ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.