ఈరోజుల్లో, చాలామంది డయాబెటిస్ (Diabetes) తో బాధపడుతున్నారు. మీరు కూడా డయాబెటిస్ తో బాధపడుతున్నారా..? అయితే కచ్చితంగా ఆహారంలో మార్పులు చేసుకోండి. ముఖ్యంగా ఆహారంలో మిల్లెట్స్ ని తీసుకోవడం వలన డయాబెటిస్ సమస్యకి సులభంగా చెక్ పెట్టవచ్చు. మధుమేహంతో బాధపడే వాళ్ళకి, మిల్లెట్స్ అద్భుతంగా పనిచేస్తాయి. నిజానికి ఒక దివ్య ఔషధం అని చెప్పొచ్చు. మధుమేహాన్ని అదుపులో ఉంచే, మిల్లెట్స్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. మధుమేహం ఉన్న వాళ్ళకి వచ్చే ప్రతి సమస్య కూడా తినే ఆహారం బట్టి ఉంటుంది.
నిజానికి ఆహారం కారణంగానే సమస్య మొదలవుతుంది. కనుక మధుమేహ రోగులు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీన్ని పాటించారంటే, కచ్చితంగా షుగర్ కంట్రోల్ అవుతుంది. మిల్లెట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషంట్లకి మిల్లెట్స్ ఒక వరం చక్కెర స్థాయిలని సులభంగా మిల్లెట్స్ ద్వారా తగ్గించుకోవచ్చని పరిశోధన ఫలితాలు చెప్తున్నాయి. మిల్లెట్స్ ని మీరు సాధారణంగా అన్నం వండుకున్నట్లు వండుకోవచ్చు. లేదంటే వీటిని పిండి చేసుకుని చపాతీలు, రొట్టెలుగా చేసుకుని తీసుకోవచ్చు. జొన్నలు (Jowar) మధుమేహంతో బాధపడే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తాయి.
మధుమేహం ఉన్న వాళ్ళు జొన్నలను తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు. జొన్నలలో గ్లూటెన్ ఉండదు. ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా జొన్నల్లో ఉంటాయి.రాగులు కూడా షుగర్ పేషెంట్లకి మెడిసిన్ లాగ పనిచేస్తాయి. ఇందులో క్యాల్షియం ఎక్కువ ఉంటుంది. గ్లూటెన్ అస్సలు ఉండదు. రాగులని (Finger millets) సూపర్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. సజ్జలు తీసుకుంటే కూడా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళకి ఎంతో ఉపయోగం ఉంటుంది. ఫైబర్ చక్కెర ని సులభంగా, వేగంగా జీర్ణం చేయడానికి సహాయం చేస్తుంది.
బార్లీ గింజలని (Barley) తీసుకుంటే కూడా మంచిదే. మీరు బార్లీ ధాన్యాన్ని పిండిగా తయారు చేసుకుని రొట్టెలు చేసుకోవచ్చు. డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు, ఓట్స్ ని తీసుకుంటే కూడా మంచిదే. ఇలా సులభంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్ళు డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. ఈ మిల్లెట్స్ ని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే, షుగర్ వలన సమస్య కలగదు. లేకపోతే లేనిపోని ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి మిల్లెట్స్ ఎలా పనిచేస్తాయో చూ
© 2023 - 2024 Millets News. All rights reserved.