మనకు అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఏ పని చేయలేకపోతూ ఉంటాం, నిద్రపోయి లేచిన లేదా కింద కూర్చుని లేచిన ఒక్కసారిగా మన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి అని అంటే సాధారణంగా ఎవరైనా ఏమనుకుంటారు? సమయానికి భోజనం చేయకపోవడం వల్లనే ఇలా జరుగుతూ ఉంది అని అనుకుంటారు. చాలామంది సమయానికి భోజనం చేయడం ద్వారా ఎన్నో రకాల అనారోగ్యాలకు చెక్ పెట్టవచ్చు అని కూడా కలలు కంటూ ఉంటారు.
మరికొందరేమో రక్తంలో అధిక శాతం చక్కెర కారణంగా కళ్ళు తిరుగుతుంది అని అనుకుంటారు. ఇది రెండు తప్పే. ఎప్పుడైతే మనలో ఐరన్ లోపం ( Iron Deficiency ) ఏర్పడుతుందో అప్పుడు ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ ఐరన్ డెఫిషియన్సీ అన్నది మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఐరన్ అన్నది మన శరీరంలో ప్రవహించే రక్తంలోని హిమోగ్లోబిన్ లో దాగి ఉంటుంది. నెలసరి సమయంలో రక్త స్రావం జరుగుతుంది. ఈ రక్తస్రావంతో పాటు చాలావరకు ఐరన్ ని కూడా కోల్పోవడం జరుగుతుంది. ఆ కారణంగా నెలసరి పూర్తయిన తర్వాత కళ్ళు తిరగడం నీరసంగా ఉండటం వంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు.
ఐరన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మగవారికి ఎనిమిది గ్రాముల ఐరన్ కావాల్సి ఉంటుంది. అదే 14 ఏళ్ల నుండి 18 ఏళ్లగల అమ్మాయికి 15 గ్రాముల ఐరన్ కావాల్సి ఉంటుంది. ఇక 19 ఏళ్ల నుండి 50 ఏళ్ల స్త్రీల వరకు అందరికీ 18 గ్రాముల ఐరన్ కావాల్సి ఉంటుంది. అంటే పురుషులతో పోలిస్తే స్త్రీలకు ఎక్కువ ఐరన్ కావాల్సి ఉంటుంది.
ఐరన్ ఎక్కువగా సజ్జలలో లభిస్తుంది. రోజుకి 100 గ్రాముల సజ్జలను ( Pearl millets ) తీసుకోవడం ద్వారా ఐరన్ లోపం తగ్గుతుంది. ఆడవారైతే రోజుకి 150 గ్రాముల దాకా సజ్జలను తీసుకోవాల్సి ఉంటుంది. సజ్జ పిండితో రకరకాల వంటలు తయారు చేసుకోవచ్చు. వీటితో చపాతీలు అలాగే దోసలను కూడా చేయవచ్చు. ఎప్పుడైనా సరే ఒంటికి ఐరన్ అందాలంటే మనం కేవలం ఐరన్ మాత్రం అందిస్తే సరిపోదు. ఐరన్ తో పాటు విటమిన్ సి ని కూడా అందించాలి. అంటే ప్రతిరోజు మీరు ఒక రెండు సజ్జ రొట్టెలతో పాటు ఒక గ్లాసు నిమ్మరసం తీసుకోవడం ద్వారా ఐరన్ మీ శరీరానికి బాగా అందుతుంది.
© 2023 - 2024 Millets News. All rights reserved.