ఈ మధ్యకాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. పూర్తిగా ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం గుండె ఆరోగ్యం ఎంతో అవసరం. సరైన ఆహారం, వ్యాయామం మరియు విశ్రాంతి తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అయితే ఆరోగ్యకరమైన ఆహారంలో మిల్లెట్స్ ద్వారా కూడా గుండె ఆరోగ్యాన్నిమెరుగుపరుచుకోవచ్చు.
రాగులు (Finger millet) వీటిని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల డైటరీ ఫైబర్ సరైన మోతాదులో అందుతుంది. దానివల్ల రక్తంలో ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలు బ్యాలెన్స్ గా ఉంటాయి. దాంతో గుండెకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ మిల్లెట్స్ లో ఉండేటువంటి పాలిఫినాల్స్ వల్ల యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి.
జొన్నలు (Jowar) లో కూడా ఫినాలిక్ యాసిడ్స్ వంటివి ఉంటాయి. వాటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ గుండె జబ్బులను దరి చేరకుండా చూస్తాయి. జొన్నలు లో ఉండేటువంటి ఫైబర్ మరియు ప్రోటీన్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దాంతో గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. కొర్రలు (Foxtail Millet) ఈ మిల్లెట్స్ లో కూడా యాంటీ ఆక్సిడెంట్లు చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిలో ఉండేటువంటి మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.
మైగ్రైన్ తో బాధ పడేవారికి మిల్లెట్స్ ఒక వరం.
సజ్జలు (Pearl Millet) ఈ మిల్లెట్ లో కూడా మెగ్నీషియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మెగ్నీషియం చాలా అవసరం. కాబట్టి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అని అనుకుంటే సజ్జలును మీ రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోండి. అంతేకాకుండా సజ్జలను తీసుకోవడం వల్ల రక్తపోటు కూడా తగ్గుతుంది దాంతో హార్ట్ స్ట్రోక్స్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వీటిలో ఉండేటువంటి పొటాషియం కూడా గుండె పనితీరును మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.
అంతేకాకుండా మిల్లెట్స్ లో ఉండేటువంటి విటమిన్ బి, కార్బోహైడ్రేట్లు శరీరంలో ఉండేటువంటి కొవ్వు పదార్థాల ను బ్రేక్ చేస్తాయి. దానివల్ల రక్తంలో ఉండే హోమోసిస్టిన్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. ఈ విధంగా శరీరంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు చేరకుండా ఉంటాయి. ఈ విధంగా మీ డైట్ లో భాగంగా మిల్లెట్స్ ను చేర్చుకోవడం వల్ల సరైన మోతాదులో పోషకాలను పొందుతారు. ఈ విధంగా పూర్తి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వీటిలో ఉండేటువంటి ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్ లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా సహాయపడతాయి అని చెప్పవచ్చు.
© 2023 - 2025 Millets News. All rights reserved.