ఇమ్యూనిటీ ను పెంచడానికి ఈ మిల్లెట్స్ ఆపద్బాంధవులు.

ఇమ్యూనిటీ ను పెంచడానికి ఈ మిల్లెట్స్ ఆపద్బాంధవులు.

ఇమ్యూనిటీ ను పెంచడానికి ఈ మిల్లెట్స్ ఆపద్బాంధవులు.

 

 

మొన్ననే కరోనా మహమ్మారి వచ్చి మన ప్రపంచాన్ని మొత్తం అతలాకుతలం చేసి వెళ్ళిపోయింది. ఎన్నో ప్రాణాలు పోయాయి. సోషల్ మీడియాలో అలాగే న్యూస్ చానల్స్ లో కరోనా ఫోర్త్ వేవ్ రావడానికి రెడీగా ఉంది అని రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉంటాయి.ఎప్పుడు ఎక్కడినుండి ఏ వ్యాధి వచ్చి బలి తీసుకుంటుందో అన్న భయం అందరిలో బలంగా నాటుకు పోయింది.

కాలాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి వ్యాధి కూడా మారుతూ ఉంటుంది. చలికాలం లేదా వర్షాకాలంలో మనమంతా జలుబు మరియు దగ్గు వంటి వ్యాధులకు గురవుతాం. అలాగే డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు కూడా వస్తాయి. ఇక వేసవికాలంలో వడదెబ్బ నీరసం వంటి వ్యాధులు వస్తాయి. వ్యాధి వచ్చిన ప్రతిసారి వ్యాధి లక్షణాలతో పాటు హాస్పిటల్ ఖర్చులు కూడా భరించాల్సి ఉంటుంది.

వ్యాధులు రాకుండా ఆపే శక్తి మనకు లేదు. కానీ అవి వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి మనకు ఎంతో అవసరం. అంటే మనలో రోగనిరోధక శక్తి బలంగా ఉండాలి. అప్పుడే ఎలాంటి వ్యాధి వచ్చినా తట్టుకొని నిలబడగలం.

చిరుధాన్యాలని మన ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చు. అందులోనూ జొన్నలను ( Sorghum )అధికంగా తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనియన్ సిస్టం బాగా మెరుగుపడుతుంది. జొన్న పిండితో రొట్టెలు చేసుకుని ప్రతి రోజు తినడం ద్వారా కూడా మన వ్యాధుల బారిన పడకుండా ఉంటాం. పాత కాలం లో అయితే జొన్న పిండి తో తీపి గారెలు కూడా చేసేవారు.బహుశా అందుకే ఏమో పాత కాలం నాటి వారు అంతా బలంగా ఉండేవారు.

ఇక సజ్జలు (Pearl millets )ను ఆహారం లో భాగం చేసుకోవడం ద్వారా కూడా రోగ నిరోధక శక్తి బాగా మెరుగుపడుతుంది. బియ్యం బదులు సజ్జలను మినప్పప్పు తో నానబెట్టి, దోసెలు కూడా చేసుకోవచ్చు.ఇవి మామూలు దోసెలు తో పోలిస్తే ఎన్నో పోషకాలని అందిస్తాయి.

ఇలా ఆహారంలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా వ్యాధులు మన దరిదాపుల్లోకి కూడా రాకుండా జాగ్రత్త పడవచ్చు.


© 2023 - 2024 Millets News. All rights reserved.