చిరుధాన్యాలు ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉన్నాయి అని తెలుసుకున్న వారందరూ తమ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకున్నారు. కానీ వారి సమస్యలు తగ్గడం లేదని చాలామంది చెబుతూ ఉంటారు. అలా చెప్పిన వారి డైట్ చాట్ నీ గమనించ గా తెలిసినది ఏమిటంటే వారు కేవలం చిరుధాన్యాలను ఒక్క పూట మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. అది కూడా కేవలం మధ్యాహ్నపు సమయంలో మాత్రమే తింటూ ఉన్నారు. మిగిలిన రెండు సమయాలలో టిఫిన్స్ తింటున్నారు. టిఫిన్స్ కూడా పూర్తిగా పాలిష్ పట్టిన బియ్యంతో తయారు చేసినవి అయ్యి ఉండటమే వ్యాధి తగ్గకపోవడానికి ప్రధాన కారణం.
టిఫిన్స్ అంటే ఉత్తర భారత దేశంలో గోధుమలతో తయారుచేసిన రకరకాల పరాటాలను తింటూ ఉంటారు, అదే దక్షిణ భారతదేశంలో అయితే తెల్లటి బియ్యంతో తయారు చేసిన ఇడ్లీ, దోస ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దోస కంటే ఇడ్లీ ఎక్కువగా తీసుకుంటారు. కొన్ని ఇళ్లల్లో కేవలం ఉదయం పూట టిఫిన్ ల మాత్రమే కాకుండా రాత్రిపూట డిన్నర్ లా కూడా ఇడ్లీలనే తినేవారు చాలామంది ఉంటారు. ఇది తయారు చేయడానికి కాస్త సులభంగానే ఉంటాయి. అంతేకాదు వీటి కోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా ఉండదు. వారానికొకసారి పిండి రుబ్బి ఫ్రిజ్లో పెట్టుకుంటే సరిపోతుంది. అందుకే చాలామంది స్త్రీలు టిఫిన్ లో లేదా డిన్నర్ లో వీటినే తయారు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీటివల్ల పెద్దగా ఆరోగ్యం లభించదు. శరీరానికి ఫైబర్ లభించడం చాలా అవసరం. ఇడ్లీలో దాదాపు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. పేగులకు మంచి చేసే ఫెర్మెంటెడ్ బ్యాక్టీరియా కొంత లభిస్తుంది. కానీ ఈ ఇడ్లీ ద్వారా మనకు ప్రోటీన్ కానీ ఫైబర్ కానీ లభించదు. అధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఈ ఇడ్లీని తినడం ద్వారా రోజంతా యాక్టివ్ గా ఉండటం కూడా కష్టంగా ఉంటుంది. రెండు ఇడ్లీలను తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరగవచ్చు. కానీ నాలుగు నుండి ఐదు లేదా 10 తినడం ద్వారా ఎలాంటి లాభము ఉండదు
చాలామంది ఇడ్లీ చాలా మంచి ఆహారం అని అంటూ ఉంటారు. స్టీమ్డ్ ఫుడ్ కనుక ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. నిజమే ఫ్రైడ్ ఫుడ్ కంటే స్టీమ్డ్ ఫుడ్ ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుంది. కానీ అధిక కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ని స్టీమ్ చేసిన లేదా ఫ్రై చేసిన పెద్దగా తేడా ఏమీ ఉండదు. కనుక హై కార్బోహైడ్రేట్స్ ఉన్న ఇడ్లీలను హాయ్ ప్రోటీన్ మరియు రిచ్ ఫైబర్ ఉన్న ఇడ్లీలు గా మార్చుకోవాల్సి ఉంటుంది.
సాధారణంగా మనమంతా రెండు రకాలుగా ఇడ్లీలను తయారు చేస్తాం. ఒక ప్రాంతానికి చెందిన వారైతే మినప్పప్పుతో పాటు తెల్లటి పాలిష్ పట్టిన బియ్యాన్ని కూడా నానబెట్టి రుబ్బుకుంటారు. మరో ప్రాంతానికి చెందిన వారైతే బియ్యాన్ని రవ్వ కింద తయారు చేసి ఆ రవ్వ తో పాటు మినప్పప్పు నీ నానబెట్టి ఇడ్లీలను తయారు చేస్తారు. వీటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ తెల్లటి పాలిష్ పట్టిన బియ్యం అలాగే బియ్యపు రవ్వ బదులుగా చిరుధాన్యాలను వాడుకోవడం చాలా మంచిది. అన్ని రకాల చిరుధాన్యాలలో ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా లభిస్తుంది. కనుక చిరుధాన్యాలను ఉపయోగించి ఇడ్లీలను తయారు చేయడం ద్వారా అవి హాయ్ ప్రోటీన్ మరియు రిచ్ ఫైబర్ కలిగిన ఇడ్లీలులా తయారవుతాయి.
ఇప్పుడు ఒక్కోరకం ఇడ్లీ ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం.
కొర్రలలో బరువును తగ్గించే గుణం అధికంగా ఉంటుంది. అలాగే ఎవరైతే చక్కెర వ్యాధితో బాధపడుతూ ఉంటారు వారు కూడా ఈ కొరలను అధికంగా తీసుకోవాలి. అలాగే విటమిన్ బి కాంప్లెక్స్ లోపం ఉన్నవారు కూడా ఈ కొర్రలను అధికంగా తీసుకోవడం ద్వారా విటమిన్ బి కాంప్లెక్స్ లోపం తగ్గుతుంది
కొర్రల ఇడ్లీని రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఏ చిరుధాన్యమైన దాదాపు 6 నుండి 8 గంటలసేపు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. అలా కొర్రలను 6 గంటలసేపు నానబెట్టుకోవాలి. మరోవైపు పొట్టు తీయని మినప్పప్పుని కూడా రెండు నుండి మూడు గంటలసేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న ఈ పిండి రాత్రి మొత్తం ఫెర్మెంట్ అవ్వాలి. ఇక ఉదయం పూట సాధారణ ఇడ్లీలను తయారు చేసుకున్నట్టుగానే ఈ పిండితో ఇడ్లీలను తయారు చేసుకోవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్స్ తో పాటు ప్రోటీన్స్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఒక రకమైతే ఇందులో మరొక రకం కూడా ఉంటుంది. కొర్రలను కాస్త వేయించుకోవాల్సి ఉంటుంది. వేగిన వాసన రాగానే వాటిని ఆరబెట్టి ధాన్యం కాస్త రవ్వ అయ్యేలా మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొర్రల యొక్క రవ్వని తయారు చేసుకోవాలి. ఈ రవ్వని సాధారణ ఇడ్లీ రవ్వ స్థానంలో రీప్లేస్ చేసి ఇడ్లీలను తయారు చేసుకోవడమే. ఎవరికి ఏ పద్ధతి సులభంగా ఉంటుందో వారు ఆ పద్ధతిని ఆచరించవచ్చు.
రాగుల ద్వారా కూడా ఆరోగ్యానికి ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి. రాగులలో అధికంగా కాల్షియం లభిస్తుంది. వయసైనవారికి రాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. మోకాళ్ళ నొప్పులతో బాధపడేవారు కూడా రాగులను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా నొప్పులు పూర్తిగా తగ్గుతాయి. కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు కండరాల నొప్పులు కూడా రాగులను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా తగ్గుతాయి.
ఈ రాగి ఇడ్లీ ని కూడా రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. మొదట రాగులను ఆరు గంటలసేపు నాన్న పెట్టుకోవాలి. ఆపై మినప్పప్పుని కూడా దాదాపు రెండు గంటలు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకునే రెండిటిని కలిపి పిండి చేసుకొని ఇడ్లీలులా తయారు చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ కాస్త పెద్దదిగా అనిపించినవారు మరొక ప్రాసెస్ ని ఫాలో అవ్వచ్చు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఇడ్లీ పిండి అందుబాటులో ఉంటుంది. ఈ ఇడ్లీ పిండిలోకి నేరుగా రాగి పిండిని కలుపుకొని రాగి ఇడ్లి నీ తయారు చేయవచ్చు. లేదా నానబెట్టి రుబ్బుకున్న మినప్పిండిలో రాగి పిండిని కలిపి కూడా ఇడ్లిన తయారు చేయవచ్చు. వీటిని తీసుకోవడం ద్వారా డయాబెటిస్ తగ్గుతుంది.
రాగులతో చేసుకునే మరిన్ని రెసిపీల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కొర్రల ఇడ్లీని తయారుచేసిన విధంగానే ఈ సామల ఇడ్లీ ని కూడా తయారు చేయవచ్చు. సాములను కూడా ఆరు నుండి 8 గంటలసేపు నానబెట్టుకోవాలి. అలాగే మినప్పప్పుని కూడా నాన్న పెట్టుకోవాలి. రెండిటిని కలిపి రుబ్బుకోవాలి. ఒక రాత్రి మొత్తం ఈ పిండిని పులవనివ్వాలి. ఆపై సాధారణ ఇడ్లీలను తయారు చేసినట్టే వీటిని కూడా తయారు చేసుకోవచ్చు. కొర్రలతో ఏ విధంగా అయితే రవ్వని తయారు చేసుకున్నమో…సరిగ్గా అదే విధానంలో ఈ సామలతో కూడా రవ్వని తయారు చేసుకోవచ్చు. సాధారణ ఇడ్లీ రవ్వతో ఈ చిరుధాన్యాలతో తయారు చేసిన రవ్వని రీప్లేస్ చేసి వాడుకోవడమే…
రాగుల ఇడ్లీ ని తయారు చేసినట్టే మనం జొన్నలతో అలాగే సజ్జలతో కూడా తయారు చేసుకోవచ్చు. కొర్రలు ఇడ్లీని తయారు చేసినట్టుగానే అరికెలతో ఊదలతో అండు కొర్రలతో కూడా తయారు చేసుకోవచ్చు. కాకపోతే మినప్పప్పుని పాలిష్ పట్టిన మినప్పప్పు కాకుండా పొట్టు తీయని మినప్పప్పుని వాడుకోవడం ద్వారా మరింత ఆరోగ్యాన్ని పొందవచ్చు.
చిరుధాన్యాలతో తయారుచేసిన ఇడ్లీలే కదా అని అనుకొని ఎక్కువ తింటే ఎలాంటి లాభము ఉండదు. ఏదైనా సరే మితంగా తీసుకోవాలి.
ఈ రకంగా కేవలం భోజనం సమయంలో మాత్రమే కాకుండా ఉదయం టిఫిన్ సమయంలో కూడా చిరుధాన్యాలను వినియోగించుకోవచ్చు.
© 2023 - 2024 Millets News. All rights reserved.