మొటిమలు మరియు ఇతర చర్మవ్యాధుల నుండి రక్షణ కొరకు వాడాల్సిన చిరుధాన్యాలు.

మొటిమలు మరియు ఇతర చర్మవ్యాధుల నుండి రక్షణ కొరకు వాడాల్సిన చిరుధాన్యాలు.

మొటిమలు మరియు ఇతర చర్మవ్యాధుల నుండి రక్షణ కొరకు వాడాల్సిన చిరుధాన్యాలు.

 

నేడు చాలామంది యువత తమ చర్మాన్ని కాంతివంతంగా మరియు అందంగా మార్చుకోవడానికి చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఈ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ పై చాలా డబ్బులను ఖర్చు పెడుతూ ఉంటారు. కొందరైతే ఏకంగా వేళల్లో డబ్బులను ఖర్చు చేస్తూ ఉంటారు. అయినా సరే పెద్దగా ఉపయోగం కనిపించదు.

చాలామంది కేవలం మార్కెట్లో లభించే రకరకాల క్రీములను శరీరంపై రాయడం ద్వారా అందమైన శరీరం లభిస్తుంది అని కలలు కంటూ ఉంటారు. అది పూర్తిగా తప్పు. కేవలం శరీరంపై రాసే క్రీములతో మాత్రమే పని జరగదు. దానితోపాటు మనం శరీరానికి అందించే ఆహారం కూడా చర్మం యొక్క కాంతిని నిర్ణయిస్తుంది. 

మనకు ఏదైనా యాక్సిడెంట్ లేదా గాయం తగిలినప్పుడు కేవలం పైపూతగా ఏదైనా రాసినంత మాత్రాన గాయం మానిపోదు. గాయం త్వరగా మానాలి అంటే అందుకు తగ్గ ఆహారం కూడా తీసుకోవాల్సి ఉంటుంది. గాయం తగిలినప్పుడు డాక్టర్లు కొన్ని కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని చెబుతూ ఉంటారు. డాక్టర్లు చెప్పిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం ద్వారా మనకు తగిలిన గాయం త్వరగా మానుతుంది. కానీ అవేమీ పట్టించుకోకుండా తినాల్సినవి తింటూ కేవలం పైపూతగా రాయాల్సిన మందులు రాస్తూ ఉంటే గాయం మానదు.

సరిగ్గా అదే విధంగా కేవలం పైపూతగా క్రీములు రాస్తూ ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే చర్మం ఆరోగ్యవంతంగా ఉండదు. చిరుధాన్యాలు కేవలం బరువు తగ్గడంలో అలాగే చక్కెర వ్యాధిని నియంత్రణలో పెట్టడానికి మాత్రమే కాదు శరీరానికి సంబంధించిన అన్ని రోగాలను నియంత్రిస్తుంది. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.

కొర్రలు:-

కొర్రలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా ఉపయోగపడతాయి. కొర్రలలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ కొర్రలు ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతాయి. తద్వారా అందమైన మరియు కాంతివంతమైన చర్మాన్ని అందిస్తుంది. అలాగే ఈ కొర్రలలో వైటమిన్ సి అలాగే వైటమిన్ ఈ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ ఈ అలాగే విటమిన్ సి చర్మం యొక్క ఆరోగ్యాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది.

ఉదలు:-

ఊదలలో ఐరన్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ ఐరన్ చర్మం లో ఉండే కణాలకు ఆక్సిజన్ చేరవేస్తుంది.తద్వారా చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఊదలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి ఎలాంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.అలాగే స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.

జొన్నలు:-

జొన్నలు తినడం ద్వారా వైటమిన్ బి బాగా లభిస్తుంది. అందులోనూ విటమిన్ బి త్రీ ఇంకా పుష్కలంగా లభిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ విటమిన్ బి త్రి చాలా అవసరం. విటమిన్ బి త్రి అనగా నియాసిన్. మీరు కనుక గమనిస్తే చాలా క్రీమ్లలో అలాగే సిరంలో ఈ నియాసిని వాడడం జరుగుతుంది. నియాసిన్ శరీరంపై రాస్తేనే అంత ఉపయోగమున్నప్పుడు నీయాసిన్ కలిగి ఉన్న ఈ జొన్నలను ప్రతిరోజు తినడం ద్వారా చర్మానికి మరెంత ఉపయోగం ఉంటుందో ఆలోచించండి. అన్ని చిరుధాన్యాలలో లాగానే ఈ జొన్నలలో కూడా యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా లభిస్తాయి 

రాగులు:

రాగులలో క్యాల్షియం అధికంగా లభిస్తుంది…అని అందరూ చెబుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నవారు తప్పకుండా రాగులను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి అని అందరూ అంటారు. కేవలం మోకాళ్ల నొప్పులు లేదా డయాబెటిస్ ఉన్నవారు మాత్రమే కాదు చర్మం ఆరోగ్యంగా ఉండాలి అని అనుకున్న వారు కూడా రాగులను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. రాగులలో మీతోయోనైన్ ఉంటుంది. ఈ మిథియోనైన్ స్కిన్ లో కొలజన్ ఇంట్లో ఇవ్వడానికి బాగా పనిచేస్తుంది. ఈ కొలజం ద్వారా చర్మం ఆరోగ్యవంతంగా ఉంటుంది. అలాగే వయసు పైబడే కొద్దీ వచ్చే వ్రింకెల్స్ , ఫైన్ లైన్స్ వంటివి రాకుండా చర్మం యంగ్ గా ఉంటుంది.

సజ్జలు:-

సజ్జలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఐరన్ అలాగే జింక్ మన శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. ఐరన్ చర్మం ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. ముందుగా చెప్పుకున్నట్టుగా ఐరన్ ద్వారా చర్మానికి ఆక్సిజన్ అందుతుంది. ఇక జింక్ ఏమో చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది.

ఇలా చిరుధాన్యాల ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అంతేకాదు చర్మం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని కొన్ని ఆహార పదార్థాలకు తప్పకుండా దూరంగా ఉండాలి.

*ఈస్ట్ వేసి తయారు చేయబడిన ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాల్సి ఉంటుంది.

*అధిక చెక్కర శాతం ఉండే చాక్లెట్లు కేకులు ఐస్ క్రీమ్లకు దూరంగా ఉండాలి. అధిక చక్కర శాతం ఉన్న ఆహార పదార్థాలు లివర్ పై అధిక భారాన్ని చూపుతాయి. తద్వారా కేవలం చర్మం మాత్రమే కాదు మన శరీరంలో ఉండే అనేక అవయవాలు పాడవుతాయి.

*అధిక ఉప్పు అలాగే అధిక కారానికి దూరంగా ఉండాలి.. బాగా నూనెలో వేయించిన పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. వీటి ద్వారా చర్మంపై మొటిమలై కాకుండా చర్మం త్వరగా వయసు అయిపోయినట్టు కనిపించడం మొదలవుతుంది.

*అలాగే ఎక్కువగా ఎండలో తిరగడం ద్వారా కూడా చర్మం పాడవుతుంది. ఎండలోకి వెళుతున్నప్పుడు తప్పకుండా చర్మానికి సన్ స్క్రీన్ రాసుకోవడం ద్వారా ఎండ వేడి నుండి చర్మాన్ని కాపాడు కోవచ్చు.

ఇలా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తూ ఆహారంలో చిరుధాన్యాలను భాగం చేసుకోవడం ద్వారా కాంతివంతమైన మరియు అందమైన ఆరోగ్యవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

 


© 2023 - 2025 Millets News. All rights reserved.