Products

కొర్రలు

కొర్రలను ఫాక్స్ టైల్ మిల్లెట్ అని అంటారు. ఇవి చూడటానికి అచ్చం సజ్జలు ఎలా ఉంటాయి కాకపోతే పసుపు రంగుని కలిగి ఉంటాయి. వీటి రుచి కమ్మగా ఉంటుంది. కొర్రలలో పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలి అని అనుకునేవారు ప్రతిరోజు కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా బరువుని సులభంగా తగ్గించుకోవచ్చు. కొర్రలు కడుపు నిండిన భావనని కలిగిస్తాయి. వీటిలో ఉన్న ప్రోటీన్ మనకు శక్తిని అందిస్తాయి. ఎప్పుడైతే ఇలాంటి భావన మనలో ఏర్పడుతుందో మనం చిరు తిండ్ల పై ఆధారపడకుండా ఉంటాం. అలాగే కొర్రలలో నుండి వచ్చే ప్రోటీన్ ద్వారా వ్యాయామాలు కూడా సులభంగా చేసుకోవచ్చు

కొర్రలు లో విటమిన్ బి12 అధికంగా లభిస్తుంది. ప్రస్తుతం ఎంతోమంది వైటమిన్ బి12 లోపంతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. సగం వ్యాధులకు ముఖ్య కారణం ఈ విటమిన్ బి12 లోపమే. ఈ విటమిన్ బి12 లోపం ఎక్కువైతే వృద్ధాప్యంలో ఆల్జీమర్స్ వ్యాధి వస్తుంది. ఎవరైతే కొర్రలను ప్రతిరోజు ఆహారంగా తీసుకుంటారో వారికి బి12 పుష్కలంగా లభిస్తుంది. అలాగే భవిష్యత్తులో బి12 లోపం వల్ల ఎదురయ్యే వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. ఆర్థరైటిస్ వ్యాధి ఉన్నవారు కూడా కొర్రలను ఆహారంగా తీసుకోవాలి.

కొర్రల వల్ల మరో ముఖ్యమైన ఉపయోగం ఏమిటంటే ఇందులో లో గ్లైకామిక్ ఇంటెక్స్ ఉంటుంది. అలాగే ఇందులో ఉండే అధిక ఫైబర్ కారణంగా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. తద్వారా మెల్లగా చక్కెర రక్తంలోకి విడుదలవుతుంది. ఈ కారణంగా డయాబెటిస్ కూడా రాకుండా ఉంటుంది. డయాబెటిస్ ని తగ్గించుకోవాలనుకున్న వారు కూడా కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవాలి

కొర్రలను ప్రతిరోజు తినడం ద్వారా ఐరన్ జింక్ క్యాల్షియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. ఐరన్ లోపం కూడా తగ్గుతుంది.

అరికెలు

ప్రతి ఒక్క చిరుధాన్యము ద్వారా చాలా ఉపయోగాలు ఉంటాయి. అరికెలు ద్వారా కూడా మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది ఆస్తమాతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అరికెలను తమ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆస్తమాని దూరం చేసుకోవచ్చు. ఆస్తమాలో మెగ్నీషియం కంటెంట్ అధికంగా ఉంటుంది. ఈ మెగ్నీషియము మూసుకున్న శ్వాస నాళాలను తెరవడానికి ప్రయత్నం చేస్తుంది. వాయునాలల్లో ఏర్పడే మంట లాంటి నొప్పిని కూడా ఇది తగ్గిస్తుంది.

అరికెల ద్వారా మైగ్రేన్ తలనొప్పిని కూడా తగ్గించుకోవచ్చు. ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండడం ద్వారా బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గుతుంది. తద్వారా గుండె బలంగా తయారవుతుంది. ప్రతి ఒక్క చిరుధాన్యము బరువు తగ్గడానికి బాగా ఉపయోగపడుతుంది. గుండె వ్యాధులు కలిగి బరువు తగ్గాలి అని అనుకున్న వారు హాయిగా కొర్రలను తమ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఊబకాయం కలిగి ఉన్న వారు వీటిని అన్నం లాగా వండుకొని కూడా తినవచ్చు. ఇలా తినడం ద్వారా శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది.అలాగే ఇవి డయాబెటిస్ ని కూడా తగ్గిస్తాయి. మెనోపాజ్ స్టేజ్ దాటిన తరువాత చాలామంది స్త్రీలు కడుపునొప్పితో బాధపడుతూ ఉంటారు. లేదా పూర్తిగా శక్తిని కోల్పోతూ ఉంటారు. కొందరైతే అధికంగా బరువు పెరిగిపోతూ ఉంటారు. అలాంటి స్త్రీలు అరికెలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా పోస్ట్ మెనోపాజ్ స్టేజ్లో వచ్చే అన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.

అరికెల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ ద్వారా డైజెస్టివ్ సమస్యలు దూరం అవుతాయి. అలాగే చాలామంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఒక వయసు దాటిన తర్వాత హాయిగా నిద్రపోవాలి అంటే కూడా అదృష్టం ఉండాలి. నిద్రలేమికి చెక్ పెట్టాలి అంటే తప్పకుండా అరికెలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

ఊదలు

ఊదలు నిజానికి కాస్త తీయగా ఉంటాయి. చాలామంది స్త్రీలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య కారణంగా చిన్న వయసులోనే అధిక బరువు కలిగి ఉండటం లేదా పిసిఒడి పిసిఒఎస్ లాంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ కారణంగా అబార్షన్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ ఇబ్బందుల కారణంగా చాలామంది స్త్రీలు మానసికంగా కుమిలిపోతూ ఉంటారు. ఈ థైరాయిడ్ హార్మోన్ డెఫిషియన్సీ తగ్గాలి అని అనుకున్న వారు తప్పకుండా ఊదలను ఆహారంలో భాగం చేసుకోవాలి.

*జీర్ణాశయంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ ఊదలు వాటిని తగ్గిస్తాయి. కడుపులో ఎలాంటి పుండ్లు ఉన్నా కూడా తగ్గుతాయి. అలాగే పెద్ద పేగు కి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నా లేదా పెద్ద పేగు యొక్క క్యాన్సర్ ఉన్న ఈ ఊదలు వాటిని తగ్గిస్తాయి. జీర్ణాశయంలో వ్యాధిని తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో జీర్ణాశయానికి సంబంధించిన ఎలాంటి వ్యాధి రాకుండా చూసుకుంటుంది.

*చిరుధాన్యాలలో అన్ని ధాన్యాలు మధుమేహానికి బాగా ఉపయోగపడతాయి. అందులో ఊదలు కూడా మధుమేహాని తగ్గించడానికి ఉపయోగపడతాయి.

*ఊదలలో పీచు పదార్థం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన కాన్స్టిపేషన్ (మలబద్ధకం) ప్రాబ్లెమ్ కి చెక్ పెట్టవచ్చు.

*చాలామంది స్త్రీలు గర్భాశయ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరు స్త్రీలు గర్భాశయ క్యాన్సర్ తో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ ఊదలు గర్భాశయానికి సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా తగ్గిస్తాయి. పదహారేళ్లు దాటిన ప్రతి ఒక్క అమ్మాయి ఊదలను ఆహారంలో భాగం చేసుకోవడం ఎంతో అవసరం. అలా భాగం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో రాబోయే గర్భాశయ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

*కేవలం గర్భాశయ వ్యాధులు మాత్రమే కాదు లివర్ వ్యాధులు లేదా లివర్ క్యాన్సర్ ని కూడా దూరం చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతూ ఉంటారో వారు కూడా ఊదలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను కూడా తగ్గించుకోవచ్చు.

*ఊదలు గుండె యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది. గుండె యొక్క కండరాలకు బలాన్ని చేకూరుస్తుంది. మూత్రశయం అలాగే గాల్ బ్లాడర్ నీ శుద్ధి చేస్తుంది.

*ఈ ఊదలు స్త్రీలకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఊదలతో చేసిన ఆహారాన్ని పెట్టడం ద్వారా బాలింతలు చాలా ఆరోగ్యంగా ఉంటారు. పాలిచ్చే తల్లులకు కూడా ఊదలు బాగా ఉపయోగపడతాయి.

ఊదల ద్వారా 0.02 గ్రామ్స్ క్యాల్షియం కూడా లభిస్తుంది. ఎముకలు బలంగా ఉండాలి అంటే క్యాల్షియం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఇందులో 2. 90mg ఐరన్ కూడా ఉంటుంది. రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ పెరగాలి అంటే తప్పకుండా ఐరన్ కావాల్సి ఉంటుంది.స్త్రీలకు ఐరన్ కాస్త ఎక్కువగానే కావాలి.ఉదలు ఏ వయసు ఆడవారికి అయినా చాల మేలు చేస్తాయి

సామలు

సామలు వల్ల అధిక లాభాలు ఉన్నాయి. సామలు కాస్త తీయగా ఉంటాయి. అన్ని చిరుధాన్యాలు అధిక రక్తపోటుని తగ్గించడానికి ఉపయోగపడతాయి. కానీ ఈ సామలు కాస్త అధికంగా ఉపయోగపడతాయి. అధిక రక్తపోటుతో బాధపడేవారు కేవలం ఈ ఒక్క చిరుధాన్యాన్ని తిని కూడా తమ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోవచ్చు. చాలామంది ఆర్థరైటిస్ తో బాధపడుతూ ఉంటారు. వారు కూడా సామలను ఆహారంగా తీసుకోవచ్చు. నేడు పదహారేళ్ల పిల్లల నుండి 60 ఏళ్ల ముసలి వారి వరకు అందరూ రకరకాల చర్మవ్యాధులతో బాధపడుతూ ఉంటారు. నిత్యం పొల్యూషన్ లో ఉండటమే దీనికి ఒక ముఖ్యమైన కారణం. చర్మ వ్యాధులు తగ్గించుకోవాలి అంటే సామలను ఆహారంలో భాగం చేసుకోవాలి. చాలామంది చిరుధాన్యాలు ఒక పిల్లలకు పెట్టవచ్చు ఆ లేదా అని ఆలోచిస్తూ ఉంటారు. చిరుధాన్యాలు పిల్లలకు పెట్టుకోవచ్చు. ఇవి బాగా జీర్ణం అవడంతోపాటు పిల్లలకు చిన్న వయసులో కావాల్సిన అన్ని రకాల ఖనిజాలు దొరుకుతాయి.

బోన్ హెల్త్ అలాగే మజిల్ హెల్త్ బాగుండాలి అంటే సామలను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. యాక్సిడెంట్ జరిగిన వారు లేదా కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలిన వారు తమ దెబ్బ త్వరగా తగ్గాలి అన్నా త్వరగా కోలుకొని నడవాలి అని అన్నా సామలను ఆరోగ్యంలో భాగం చేసుకోవాలి. డయాబెటిస్ తగ్గించుకోవాలి అని అనుకున్న వారు కూడా సామలను ఆహారంలో భాగం చేసుకోవచ్చు. శాకాహారుల్లో సాధారణంగా పోషకాహార లోపం ఎక్కువగా ఉంటుంది, అలాగే వైటమిన్ లోపం కూడా కలిగి ఉంటారు. ఈ సాములను తినడం ద్వారా శాఖాహారులు కూడా వారికి కావాల్సిన పోషకాలను పొందుతారు అలాగే విటమిన్ లోపాన్ని కూడా దూరం చేసుకోగలరు.

అండు కొర్రలు

అండు కొర్రలలో విటమిన్ బి 3 పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ బి 3 అంటే నియాసిన్ ద్వారా స్కిన్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. అలాగే చర్మం చాలా ఆరోగ్యంగా మరియు అందంగా తయారవుతుంది. అండు కొర్రల ద్వారా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. ఇందులో ఉండే ఐరన్ కారణంగా రక్తహీనత సమస్యలను కూడా దూరం చేసుకోవచ్చు. ఇందులో ఉండే అధిక కాల్షియం ద్వారా ఎముకలకు మరియు కండరాలకు బలం చేకూరుతుంది. మోకాళ్ళ నొప్పులు కీళ్ల వాపులు కలిగిన వారు, ఈ అండు కొర్రలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా నొప్పులు కూడా దూరమవుతాయి.

అండు కొర్రలను ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా జీర్ణశక్తి మెరుగుపడుతుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అజీర్తి మలబద్ధకం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ప్రతి ఒక్క చిరుధాన్యం రెండు పనులను తప్పకుండా చేస్తుంది. మొదటిది బరువుని తగ్గిస్తుంది. రెండవది చక్కెర వ్యాధిని తగ్గిస్తుంది. ఇవి రెండూ అదుపులో ఉంటే సగం వ్యాధులకు దూరంగా ఉంటాం.

Buy now

© 2023 - 2024 Millets News. All rights reserved.