హైదరాబాద్ లో నటి రకుల్ ప్రీత్ సింగ్ మిల్లెట్స్ రెస్టారెంట్ ''ఆరంభం''..!

హైదరాబాద్ లో నటి రకుల్ ప్రీత్ సింగ్ మిల్లెట్స్ రెస్టారెంట్ ''ఆరంభం''..!

హైదరాబాద్ లో నటి రకుల్ ప్రీత్ సింగ్ మిల్లెట్స్ రెస్టారెంట్ ''ఆరంభం''..!

 

నటి రకుల్ ప్రీత్ సింగ్ సినిమాలు ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తాజాగా, హైదరాబాదులో సరికొత్త రెస్టారెంట్ ని మొదలు పెట్టారు. ''ఆరంభం'' పేరుతో హైదరాబాదులోని ఈ మిల్లెట్స్ రెస్టారెంట్ ని ప్రారంభించారు.  

ఆరంభం పేరుతో ప్రారంభించిన ఈ రెస్టారెంట్లో, కేవలం మిల్లెట్స్ తో తయారు చేసిన వంటకాలు మాత్రమే లభిస్తాయి. క్యూర్ ఫుడ్స్ తో కలిసి రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఆరంభాన్ని మొదలుపెట్టారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హైదరాబాదులో మిల్లెట్ సెంట్రింగ్ రెస్టారెంట్ ( Millets Restaurant ) ని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. కేవలం పోషకాహారమే కాకుండా రుచికరమైన ఆహారం కూడా తీసుకోవాలని రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు నాకు చాలా దగ్గరగా ఉంటుందని, అందుకే ఇక్కడ నుండే నేను సినీ కెరీర్ ని స్టార్ట్ చేశాను అని, F&B వెంచర్ కూడా ఇక్కడ నుండే మొదలుపెట్టామని అన్నారు.

రుచితో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఇక ఆరంభం నుండి తీసుకోవచ్చని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు.  ఇక్కడే కాకుండా ఇంకో రెండు రెస్టారెంట్లని బెంగళూరు, చెన్నైలో ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అలానే పది క్లౌడ్ కిచెన్స్ ని కూడా ఈ ఏడాది ప్రారంభించబోతున్నట్లు రకుల్ ప్రీత్ సింగ్ చెప్పారు. గతంలో రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి మనకి తెలుసు. అయితే, దీనిలో భాగంగా హైదరాబాద్, వైజాగ్ మహానగరంలో ఎఫ్-45 పేరుతో జిమ్ లను ఏర్పాటు చేసి వ్యాపారాన్ని మొదలుపెట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ స్టార్ట్ చేసిన ఈ జిమ్ లకి టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా వెళ్తూ ఉంటారు. బిజినెస్ ఏ కాదు వెల్ బీయింగ్ న్యూట్రిషన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్ లకి సంబంధించి పార్ట్నర్షిప్ కూడా ఈమెకి ఉంది. తాజాగా ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం లోకి ఎంట్రీ ఇచ్చారు.
 


© 2023 - 2024 Millets News. All rights reserved.